సాక్షి, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది.
దీంతో పాటు ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment