న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్లో భారత టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా జోడీ, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న జంట ముందంజ వేశాయి. సానియా, బోపన్న జోడీలు తమ తమ విభాగాల్లో ప్రీక్వార్టర్స్లో ప్రవేశించాయి.
మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా, మార్టినా హింగీస్ 6-1 6-1 స్కోరుతో టిమియా బస్కిజ్కీ (స్విట్జర్లాండ్), చియా జంగ్ చాంగ్ (చైనీస్ తైపీ)పై సునాయాసంగా విజయం సాధించారు. ఇక పురుషుల డబుల్స్లో బోపన్న, ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) 6-3 7-6 (4/7)తో మారియస్ ఫిర్స్టెన్బర్గ్ (పోలాండ్), శాంటియగొ (మెక్సికో)ను ఓడించారు.
సానియా, బోపన్న జోడీల ముందంజ
Published Sun, Sep 6 2015 2:15 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement