రన్నరప్ యూకీ బాంబ్రీ | Yuki runner-up bambri | Sakshi
Sakshi News home page

రన్నరప్ యూకీ బాంబ్రీ

Published Sun, Sep 27 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

రన్నరప్ యూకీ బాంబ్రీ

రన్నరప్ యూకీ బాంబ్రీ

కావుషుంగ్ (తైవాన్): ఏటీపీ చాలెంజర్ ఈవెంట్‌లో భారత టెన్నిస్ యువ ఆటగాడు యూకీ బాంబ్రీ రన్నరప్‌గా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ను మట్టికరిపించిన నాలుగో సీడ్ బాంబ్రీ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో యూకీ 5-7, 4-6తో ప్రపంచ 75వ ర్యాంకర్ హియాన్ చుంగ్  (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

ఈ ఫలితంతో యూకీ ఖాతాలో 75 పాయింట్లు చేరగా , ర్యాంకింగ్స్‌లోనూ టాప్-100 దగ్గరలోకి రానున్నాడు. వారం విశ్రాంతి అనంతరం 23 ఏళ్ల యూకీ తాష్కెంట్ చాలెంజర్ ఈవెంట్‌లో ఆడనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement