Sumit Nagal Reaches 2023 ATP Rome Challenger Final, Details Inside - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న సుమీత్‌ నగాల్‌  

Published Sun, Apr 30 2023 10:49 AM | Last Updated on Sun, Apr 30 2023 12:36 PM

Sumit Nagal Reaches Rome Challenger Final - Sakshi

ఏటీపీ చాలెంజర్‌ యూరోపియన్‌ క్లే సీజన్‌లో భారత ఆటగాడు సుమీత్‌ నగాల్‌ జోరు కొనసాగుతోంది. రోమ్‌ ఓపెన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో నగాల్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్‌లో ప్రపంచ 347వ ర్యాంకర్‌ నగాల్‌ 2–6, 7–5, 6–4 స్కోరుతో 198వ ర్యాంకర్‌ జోరిస్‌ డి లూర్‌ (బెల్జియం)పై విజయం సాధించాడు.

2 గంటల 31 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫైనల్లో జెస్పర్‌ డి జోంగ్‌ (నెదర్లాండ్స్‌)తో నగాల్‌ తలపడతాడు. ఇక్కడ విజయం సాధిస్తే యూరోపియన్‌ క్లే పై ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. నగాల్‌ ఇప్పటి వరకు కెరీర్‌లో 3 ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలు సాధించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement