
చెన్నై: సొంతగడ్డపై భారత టెన్నిస్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సుమీత్ నాగల్, విజయ్ సుందర్ ప్రశాంత్, అర్జున్ ఖడే తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. విజయ్ సుందర్ 6–2, 2–6, 6–2తో కార్లోస్ బొలుడా (స్పెయిన్)పై, అర్జున్ ఖడే 6–4, 6–1తో ఇవాన్ నెడెల్కో (రష్యా)పై విజయం సాధించగా... సుమీత్ నాగల్ 6–3, 6–2తో డేవిడ్ పెరెజ్ (స్పెయిన్)ను ఓడించాడు. రెండో రౌండ్‌లో సాకేత్ మైనేనితో ప్రశాంత్ తలపడతాడు. ఇతర భారత ఆటగాళ్లు అభినవ్ సంజీవ్, దక్షిణేశ్వర్ సురేశ్, సిద్ధార్థ్ రావత్ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు