
న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో డబుల్స్ భాగస్వామ్యం ఈ మధ్య సమస్యగా మారింది. పేస్‌తో జోడీ కట్టేందుకు బోపన్న నిరాకరిస్తుండటంతో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. దీనిపై టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ మాట్లాడుతూ ఇది ఒక్క డబుల్స్‌కే పరిమితం కాదని... సింగిల్స్‌కూ వర్తిస్తుందన్నారు. సీజన్ మొత్తం జరిగే ఏటీపీ టూర్లలో ఆటగాళ్ల మధ్య కలివిడితనం, కలుపుగోలు లక్షణాలు ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ‘డబుల్స్ జోడీల సమస్య సరే. నా వరకైతే అది రెండో ప్రాధాన్యాంశం. ముందుగా మాట్లాడాల్సింది సింగిల్స్ గురించే! ఎందుకంటే డేవిస్ కప్‌లో నాలుగు సింగిల్స్ మ్యాచ్‌లుంటాయి. మన లక్ష్యం వరల్డ్ గ్రూప్ బెర్తు.
అక్కడికి అర్హత సాధించాలంటే మనవాళ్లంతా సింగిల్స్‌లో టాప్–50 ఆటగాళ్లుగా ఎదగాలి. ఇలాంటి పరిస్థితి ఉందా. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కానీ, ఆటగాళ్లు కానీ ఎవరికి వారుంటే ఏం లాభం. నిజానికి... ఎవరు కూడా సింగిల్స్ లేదంటే డబుల్స్ స్పెషలిస్టు ఆటగాడినవుతానని టెన్నిస్ నేర్చుకోరు. కానీ భారత్ డబుల్స్‌లోనే పటిష్టం. దీన్ని కాదనలేం. అయితే సింగిల్స్‌ను, డబుల్స్‌ను సమదృష్టితో చూస్తేనే మరిన్ని మంచి ఫలితాల్ని ఆశించవచ్చు. దీని కోసం అందరు కలిసిపోవాలి. తమ అనుభవాల్ని, నైపుణ్యాన్ని ఒకరికొకరు పంచుకోవాలి’ అని విజయ్ అమృత్‌రాజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment