వింబుల్డన్లో సానియా జోరు | sania mirza pair entres into final at wimbledon open | Sakshi
Sakshi News home page

వింబుల్డన్లో సానియా జోరు

Published Fri, Jul 10 2015 6:55 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

వింబుల్డన్లో సానియా జోరు

వింబుల్డన్లో సానియా జోరు

లండన్: వింబుల్డన్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో సానియా అడుగు దూరంలో నిలిచింది. మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్)తో కలసి ఆడుతున్న సానియా ఫైనల్లో ప్రవేశించింది.

శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్లో టాప్ సీడ్ సానియా/హింగీస్ 6-1, 6-2తో అమెరికా జోడీ రాక్వెల్ జోన్స్, అబిగెయిల్ స్పియర్స్పై అలవోకగా విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా ద్వయం వరుసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్ను వశం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement