టాప్-10లో సానియా | Sania Mirza come back into top 10 WTA Team Rankings | Sakshi
Sakshi News home page

టాప్-10లో సానియా

Published Mon, Oct 21 2013 5:05 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

టాప్-10లో సానియా

టాప్-10లో సానియా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి దూసుకెళ్లింది. సోమవారం ప్రకటించిన డబ్ల్యూటీఏ తాజా టీమ్ ర్యాంకింగ్స్ జాబితాలో సానియా రెండు స్థానాలు మెరుగుపరచుకుని తొమ్మిదో ర్యాంక్ సాధించింది. సానియా ఇటీవల ఎక్కువగా డబుల్స్ పైనే ప్రధానం దృష్టిసారిస్తోంది.

ఈ వారంలో 26 ఏళ్ల సానియా ఏ ఈవెంట్లోనూ పాల్గొనకున్నా.. ఇటీవల చైనా ఓపెన్, పసిఫిక్ ఓపెన్ టైటిళ్లను వెంటవెంటనే సొంతం చేసుకోవడంతో ర్యాంక్ మెరుగైంది. హైదరాబాదీ భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) కూడా ఓ స్థానం సంపాదించి 13వ ర్యాంక్ దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement