
సోమ్‌దేవ్ ఓటమి
లండన్: భారత టెన్నిస్ స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మరోసారి తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఎగాన్ చాంపియన్‌షిప్‌లో సోమ్‌దేవ్ తొలిరౌండ్‌లో 4-6, 5-7తో కెన్నీ డి షెపర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకున్నాడు.
మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా సాధించలేకపోయిన అతను రెండుసార్లు సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఏటీపీ సర్క్యూట్‌లో సోమ్‌దేవ్ ఆడిన చివరి పది టోర్నీల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచాడు.