రోమ్: భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ.. రోమ్ మాస్టర్స్ టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి బరిలో దిగిన సానియా మహిళల డబుల్స్లో ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో సానియా-మార్టినా 6-2, 7-6(5) స్కోరుతో కరోలిన్ గార్కియా (ఫ్రాన్సు)-కేటరినా స్రెబోట్నిక్ (స్లొవేనియా)పై విజయం సాధించారు. గంటా 27 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్ను సొంతం చేసుకుంది.