సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్‌కు సొంతగడ్డపై ఓటమి ఎదురైంది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ (టై)లో నాగ్‌పూర్ ఆరెంజర్స్ 3-5, 5-3, 4-5, 5-3, 5-4 (22-20 గేమ్‌ల)తో హైదరాబాద్ ఏసెస్‌ను ఓడించింది. లెజెండ్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లలో హైదరాబాద్ గెలువగా, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో నాగ్‌పూర్‌కు విజయం దక్కింది. సోమవారం ఏసెస్, చెన్నైతో తలపడుతుంది.
హింగిస్, కార్లోవిచ్ ఓటమి
ఇద్దరు మాజీ వరల్డ్ నంబర్‌వన్‌ల మధ్య జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ముందుగా హింగిస్ ఆధిక్యం కనబర్చినా... ఆ తర్వాత జంకోవిచ్ కోలుకుంది. మొదటి గేమ్‌ను గెల్చుకున్న హింగిస్, జంకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0తో ముందంజ వేసింది. అయితే ఆ వెంటనే బ్రేక్ సాధించడంతో పాటు జంకోవిచ్ సర్వీస్ నిలబెట్టుకోవడంతో స్కోరు 2-2తో సమమైంది. సుదీర్ఘ ర్యాలీలతో హోరాహోరీగా సాగిన ఐదో గేమ్‌ను సొంతం చేసుకొని హింగిస్ మళ్లీ పైచేయి సాధించింది.
ఈ దశలో వరల్డ్ నంబర్ 22 క్రీడాకారిణి జంకోవిచ్ ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. లెజెండ్స్ మ్యాచ్‌లో జొహాన్సన్ 5-3తో అలెక్స్ కొరెట్జాను చిత్తు చేసి ఏసెస్‌కు శుభారంభం అందించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో కార్లొవిచ్-హింగిస్ జోడి 5-4తో లోపెజ్-జంకోవిచ్‌ను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో నాగ్‌పూర్ జోడి లోపెజ్-దివిజ్ 5-3తో కార్లొవిచ్-జీవన్‌పై, పురుషుల సింగిల్స్‌లో లోపెజ్ 5-4తో కార్లొవిచ్‌పై గెలుపొంది ఆరెంజర్స్‌కు విజయం ఖాయం చేశారు.
హైదరాబాద్ ఏసెస్ పరాజయం
Published Mon, Nov 30 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement