పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌పై 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాదు కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డు సమం చేశాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన జొకోవిచ్ రికార్డులు
జకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ 22. ఇందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ (10), వింబుల్డన్ (7), యూఎస్ ఓపెన్ (3), ఫ్రెంచ్ ఓపెన్ (2) ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాఫెల్ నాదల్ (22) సరసన జొకోవిచ్ నిలిచాడు.
నాదల్‌ను వెనక్కినెట్టి
జొకోవిచ్ కెరీర్‌లో నెగ్గిన టైటిల్స్ 93. అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్‌ను (92) ఐదో స్థానానికి నెట్టి జొకోవిచ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్–3లో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103), ఇవాన్ లెండిల్ (అమెరికా; 94) ఉన్నారు. పదికి పది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ 10 సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) ఫైనల్ చేరుకోగా... పదిసార్లూ గెలిచాడు.
చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్‌కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment