
మాడ్రిడ్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో... ఈ ఏడాది టెన్నిస్ టోర్నమెంట్‌లు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. ‘వచ్చే ఏడాది జనవరికల్లా టెన్నిస్ టోర్నీలు మళ్లీ మొదలైతే నేను చాలా సంబరపడతా. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే అది కూడా సాకారం అయ్యేలా కనిపించడంలేదు’ అని తన కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ అన్నాడు. కరోనా కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దు కాగా... మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ సెపె్టంబర్‌కు వాయిదా పడింది.