ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకెళ్తున్నాడు. 21వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన నాదల్ మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారం జర్మనీకి చెందిన యానిక్ హాన్ఫ్‌మన్‌ను 6-2, 6-3, 6-4తో వరుస సెట్లో ఖంగుతినిపించిన నాదల్ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటరయ్యాడు. స్విస్ సూపర్‌స్టార్ రోజర్ ఫెదరర్‌తో సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నాదల్‌కు ఇది మంచి అవకాశం.
ఫెదరర్, జొకోవిచ్ లాంటి దిగ్గజాలు ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరంగా ఉన్నారు. ఇక మూడోరౌండ్‌లో నాదల్.. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. మరో మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌ను 6-4,6-4,6-0తో ఓడించి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment