
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్‌కు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా జకోను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అతని వీసా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, స్పానిష్ బుల్ రఫేల్ నదాల్ జకో తీరును తప్పుపట్టాడు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో రూల్స్ అందరూ తప్పక పాటించాల్సిందేనని, టీకాలు తీసుకోకుండా జకో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. జకో విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును తప్పుపట్టలేమని అన్నాడు.
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన నుంచి జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు తీసుకున్నాడు. ఇందుకు నిర్వాహకులు సైతం అంగీకరించారు. అయితే వాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించకపోవడంతో జకోను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ సైతం స్పందించాడు. జకో.. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చూపితే టోర్నీలో పాల్గొంటాడని స్పష్టం చేశాడు.
చదవండి: హార్ధిక్ నుంచి ఆశించింది శార్ధూల్ నెరవేరుస్తున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment