కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేదే లేదని భీష్మించుకు కూర్చున్న వివాదాస్పద టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌కు తాను వ్యతిరేకం కాదని, బలవంతంగా తీసుకోమని ఒత్తిడి తెస్తే మాత్రం భవిష్యత్తులో జరిగే టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
ఈ ఏడాది జరగబోయే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలను వదులుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జోకో ఈ మేరకు స్పందించాడు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమానికి తానేమీ మద్దతు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా జకో స్పష్టంగా చేశాడు. శరీర ధర్మానికి తగ్గట్లుగానే తన నిర్ణయాలు ఉంటాయని, ఈ విషయంలో తననెవరైనా బలవంతం చేస్తే ట్రోఫీలు వదులుకోవడం పెద్ద సమస్య కాదని తెలిపాడు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ సెర్బియన్ స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022కు దూరమైన సంగతి తెలిసిందే.
చదవండి క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..!
Comments
Please login to add a commentAdd a comment