హలెప్‌ టాప్‌ ర్యాంకు పదిలం | Halep maintains top spot in WTA rankings | Sakshi
Sakshi News home page

హలెప్‌ టాప్‌ ర్యాంకు పదిలం

Published Mon, Apr 2 2018 4:18 PM | Last Updated on Mon, Apr 2 2018 4:18 PM

Halep maintains top spot in WTA rankings - Sakshi

మాడ్రిడ్‌: మహిళల టెన్నిస్‌ అసోసియేషన్‌ ర్యాంకింగ్స్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌ తన టాప్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తాజాగా విడుదుల చేసిన ర్యాంకింగ్స్‌లో హలెప్‌ 8,140 పాయింట్లతో నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలుపుకుంది. 

ఆ తర్వాత స్థానాల్లో వొజ్నయాకి(డెన‍్మార్క్‌-6,790 పాయింట్లు), ముగురుజా(స్పెయిన్‌-5,970 పాయింట్లు), ఇలినా స్విటోలినా(ఉక్రెయిన్‌-5,630)లు ఉన్నారు. కాగా, యూఎస్‌ క్రీడాకారిణి స్టీఫెన్స్‌ తన కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం స్టీఫెన్స్‌ 3,938 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement