జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్‌లో తలపడుతున్న క్రీడాకారులు
నేటి నుంచి ‘మెయిన్ డ్రా’ బ్యాడ్మింటన్
Published Tue, Aug 23 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
– పోటీలకు పుల్లెల గాయత్రి
– రసవత్తరంగా బ్యాడ్మింటన్ పోటీలు
తిరుపతి సెంట్రల్ : నగరంలో జరుగుతున్న సిఫీ ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం నుంచి మెయిన్ డ్రా పోటీలు జరగనున్నాయి. మూడు రోజులుగా నిర్వహించిన అండర్ 17, అండర్–19 విభాగాల క్వాలిఫైయింగ్ పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. అందులో అర్హత సాధించి, ఇది వరకే ర్యాంకింగ్ కలిగిన క్రీడాకారులు నేరుగా మెయిన్ డ్రా పోటీల్లో హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు హాజరు కానున్న ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మెయిన్ డ్రా పోటీల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇదివరకే అండర్ 15 చాంపియన్ అయిన గాయత్రి ఈ పోటీల్లో అండర్–17 విభాగంలో తన ప్రతిభను ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు.
మెయిన్ డ్రాకు అర్హత సాధించిన మహిళా క్రీడాకారులు
సింగిల్ విభాగం బాలికల అండర్–17లో దీప్తికుట్టీ (గుజరాత్), రిచాముక్తీ బో«ద్, భార్గవి, ద్రితి యాతీష్(కర్ణాటక), అద్యపర్షర్ (ఢిల్లీ), కావిప్రియ (పాండిచ్చేరి), డబుల్స్ విభాగంలో వినోనా–నిల్వ (తమిళనాడు), సాహితి బంది, వర్షిణి (తమిళనాడు), రమ్య, షీతల్ (కర్ణాటక), కే యుర మోపటి, కావిప్రియ (పాండిచ్చేరి), అండర్–19 విభాగం సింగిల్స్‌లో మనీస్ సింగ్ (యూపి),దపాషా జోషి (పంజాబ్),ముగ్దఅరే(మహారాష్ట్ర), గరిమ సింగ్ (చంఢీఘడ్), ప్రీతి, దీప్తి రమేష్ (కర్ణాటక), ఉత్సవ పలిట్ (వెస్ట్‌బెంగాల్), కుయుర మోపటì ఎంపికయ్యారు. అలాగే డబుల్స్ విభాగంలో ముగ్ద అగ్రే, వైదేహీ చౌదరి(మహారాష్ట్ర), అపేక్ష నాయక్, అర్చనా పాయ్( కర్ణాటక), కావ్య గాంధీ, అనామిక కష్యప్ (యూపీ,ఢిల్లీ), శ్రుతి మిశ్రా, సమ్రిద్ది సింగ్ (యూపీ) ఉన్నారు.
బాలురు విభాగం విభాగంలో..
సింగిల్స్ అండర్ 17లో ఈషన్ శెట్ట, వాహిద్ తాకియుద్దిన్, దేవషిస్ నవదికర్,తుకుం లా,సక్సం రాజ్‌పా,సిద్దార్థ్,శ్రీకర్ మదిన,బిద్యాసాగర్, కరన్ నెగి, అమిత్ రాథోఢ్, రోహిన్ గుర్బాణీ,అజయ్ సతీష్ కుమార్, విషాల్ దేవా, అభ్యుదయ అగర్వాల్, దేవాంగ్ ఉన్నారు. అలాగే డబుల్స్ విభాగంలో సంజీవ్‌రావు– కజ్యోయినుద్దీన్ షేక్, హేమంత్– సూర్యప్రసాద్, వికాష్ ప్రభు–కౌషిక్, ఆకాష్ ఠాగూర్–ఆకాష్ యాదÐŒ , కవీన్ ధరణీ రాజన్–మిత్రన్, రితిన్–చంద్ర, మనీష్ గౌతమ్–వివేక్ రతన్, అనుజ్‌గుప్తా–సాత్విక్ మహాజన్ ఉన్నారు. అండర్ 19 డబుల్స్ విభాగంలో భవిన్ జాదవ్–మైత్రేయి కత్రి, మన్మోహిత్ సంధూ– నాజూక్ వాలియా, సాయి పృథ్వీ–చక్రయుక్తరెడ్డి, బాలకేశ్వరి యాదవ్– మన్సిసింగ్, శ్రీకృష్ణ సాయికుమార్ పొదిలి–నిల్వ, అంకుర్ దిమన్–సమ్రిద్ది సింగ్, సౌరబ్ కెరాకర్– రితికా ఠాగూర్, రవి సింగ్– దాపష్ జోషి ఉన్నారు.
Advertisement
Advertisement