
కటక్: కామన్వెల్త్‌టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో గ్రూప్–6లో పాల్గొన్న శ్రీజ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11–7, 11–4, 11–6తో కొన్‌స్టాటినా (సైప్రస్)పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో శ్రీజకు ఆమె ప్రత్యర్థి తెగీనా నకిబులె (ఉగాండా) నుంచి వాకోవర్ లభించింది. శ్రీజతోపాటు భారత్ నుంచి కృత్విక సిన్హా రాయ్, సుతీర్థ ముఖర్జీ, మౌసుమి పాల్, ప్రాప్తి సేన్, సెలీనా సెల్వకుమార్, దివ్య దేశ్‌పాండే, సాగరిక ముఖర్జీ, అనూష కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు.
Comments
Please login to add a commentAdd a comment