Commonwealth Table Tennis
-
శ్రీజ తీన్మార్
కటక్: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలోనూ భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇంతకుముందు టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నెగ్గగా... సోమవారం ముగిసిన వ్యక్తిగత విభాగంలో అందుబాటులో ఉన్న ఐదు పసిడి పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు పతకాలు సాధించింది. మహిళల డబుల్స్‌లో మౌసుమి పాల్‌తో జతకట్టి బరిలోకి దిగిన శ్రీజ రజతం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో ఓడి ఆమె కాంస్యం సంపాదించింది. ఆదివారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకుంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో శ్రీజ 8–11, 9–11, 11–9, 8–11, 12–14తో మధురిక పాట్కర్ (భారత్) చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ ద్వయం 9–11, 8–11, 11–9, 10–12తో పూజా సహస్రబుద్దె–కృత్విక సిన్హా రాయ్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో వరుసగా హర్మీత్ దేశాయ్, అహిక ముఖర్జీ కామన్వెల్త్ చాంపియన్స్‌గా అవతరించారు. ఫైనల్స్‌లో హర్మీత్ 9–11, 6–11, 11–5, 11–8, 17–15, 7–11, 11–9తో సత్యన్ జ్ఞానేశేఖరన్ (భారత్)పై, అహిక 11–6, 11–4, 11–9, 11–7తో మధురిక (భారత్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్–మానవ్ ఠక్కర్ (భారత్) జంట 8–11, 11–6, 13–11, 12–10తో సత్యన్–శరత్ కమల్ (భారత్) ద్వయంపై గెలిచి టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్–అర్చన కామత్ జంట స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ అందుబాటులో ఉన్న 7 స్వర్ణాలను సొంతం చేసుకుంది. స్వర్ణాలే కాకుండా భారత క్రీడాకారులు ఐదు రజతాలు, మూడు కాంస్యాలనూ సాధించి 15 పతకాలతో అదరగొట్టారు. 1975లో ఇంగ్లండ్ తర్వాత కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో అన్ని విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. -
శ్రీజ తడాఖా
కటక్: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీఫైనల్ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్)పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు శ్రీజ తొలి రౌండ్లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్ (భారత్)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ (భారత్) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్ వాన్ లింగ్–తాన్ లిలిన్ జాసీ (సింగపూర్) జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్–అర్చన కామత్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, హర్మీత్ దేశాయ్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
కటక్: కామన్వెల్త్‌టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. శనివారం నిర్వహించిన క్వాలిఫయింగ్ పోటీల్లో గ్రూప్–6లో పాల్గొన్న శ్రీజ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ 11–7, 11–4, 11–6తో కొన్‌స్టాటినా (సైప్రస్)పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో శ్రీజకు ఆమె ప్రత్యర్థి తెగీనా నకిబులె (ఉగాండా) నుంచి వాకోవర్ లభించింది. శ్రీజతోపాటు భారత్ నుంచి కృత్విక సిన్హా రాయ్, సుతీర్థ ముఖర్జీ, మౌసుమి పాల్, ప్రాప్తి సేన్, సెలీనా సెల్వకుమార్, దివ్య దేశ్‌పాండే, సాగరిక ముఖర్జీ, అనూష కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. -
సెమీస్‌లో సౌమ్యజిత్
సూరత్: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు సౌమ్యజిత్ ఘోష్, సానిల్ శెట్టి, ఆంథోనీ అమల్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరుకొని మూడు పతకాలను ఖాయం చేశారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-4, 11-8, 11-6, 12-10తో గావిన్ రుమ్గె (స్కాట్లాండ్)పై, సానిల్ శెట్టి 9-11, 4-11, 11-9, 7-11, 11-8, 11-9, 11-5తో హర్మీత్ దేశాయ్ (భారత్)పై, అమల్‌రాజ్ 11-4, 11-4, 11-4, 11-2తో అభిషేక్ (భారత్)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో చెన్ ఫెంగ్ (సింగపూర్) 13-11, 9-11, 11-7, 12-10, 4-11, 11-5తో సత్యన్ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మణిక బాత్రా, మౌమా దాస్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకొని రెండు పతకాలను ఖాయం చేశారు. -
11 ఏళ్ల తర్వాత...
* కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో * భారత పురుషుల జట్టుకు స్వర్ణం సూరత్: సొంతగడ్డపై జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరిసారి భారత్ 2004లో మలేసియా ఆతిథ్యమిచ్చిన పోటీల్లో టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. భారత్ తరఫున సౌమ్యజిత్ ఘోష్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా, మరో మ్యాచ్‌లో సత్యన్ గెలిచి, హర్మీత్ దేశాయ్ ఓడిపోయాడు. మహిళల టీమ్ ఈవెంట్లో భారత్ రజతం పతకంతో సంతృపి పడింది. ఫైనల్లో భారత్ 1-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్లో భారత మహిళల జట్టు రజత పతకం నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో 1975, 1983, 1991లలో కూడా భారత్‌కు రజతమే దక్కింది.