11 ఏళ్ల తర్వాత... | Indian men down second string England to strike gold | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల తర్వాత...

Published Sat, Dec 19 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

Indian men down second string England to strike gold

* కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో
* భారత పురుషుల జట్టుకు స్వర్ణం

సూరత్: సొంతగడ్డపై జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరిసారి భారత్ 2004లో మలేసియా ఆతిథ్యమిచ్చిన పోటీల్లో టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. భారత్ తరఫున సౌమ్యజిత్ ఘోష్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా, మరో మ్యాచ్‌లో సత్యన్ గెలిచి, హర్మీత్ దేశాయ్ ఓడిపోయాడు.

మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ రజతం పతకంతో సంతృపి పడింది. ఫైనల్లో భారత్ 1-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత మహిళల జట్టు రజత పతకం నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో 1975, 1983, 1991లలో కూడా భారత్‌కు రజతమే దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement