India mens Team
-
భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఓ సంఘటన త్వరలో చోటు చేసుకోనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈనెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. ఆనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటారని, ఆ సమయంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్‌కురా (థాయ్‌లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్‌లాండ్) జోడీని ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్‌షిప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
టీటీలో భారత్‌కు మూడో విజయం
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-7, 8-11, 11-3తో ఇలియా షిమిడ్పై, రెండో సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ 11-7, 11-7, 11-7తో లియోనెల్ వెబెర్పై, మూడో సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11-7, 11-5, 11-3తో నికొలస్ చంపాడ్పై నెగ్గారు. మరోవైపు భారత మహిళల జట్టుకు వరుసగా నాలుగో విజయం దక్కింది. గ్రూప్ ‘జి’లో భాగంగా భారత్‌తో తలపడాల్సిన నైజీరియా జట్టు ‘వాకోవర్’ ఇచ్చారు. దాంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. బుధవారం జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చెక్ రిపబ్లిక్‌తో భారత పురుషుల జట్టు; క్రొయేషియాతో భారత మహిళల జట్టు తలపడతాయి. -
11 ఏళ్ల తర్వాత...
* కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో * భారత పురుషుల జట్టుకు స్వర్ణం సూరత్: సొంతగడ్డపై జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరిసారి భారత్ 2004లో మలేసియా ఆతిథ్యమిచ్చిన పోటీల్లో టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. భారత్ తరఫున సౌమ్యజిత్ ఘోష్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా, మరో మ్యాచ్‌లో సత్యన్ గెలిచి, హర్మీత్ దేశాయ్ ఓడిపోయాడు. మహిళల టీమ్ ఈవెంట్లో భారత్ రజతం పతకంతో సంతృపి పడింది. ఫైనల్లో భారత్ 1-3 తేడాతో సింగపూర్ చేతిలో ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్లో భారత మహిళల జట్టు రజత పతకం నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో 1975, 1983, 1991లలో కూడా భారత్‌కు రజతమే దక్కింది.