టీటీలో భారత్‌కు మూడో విజయం | World TT Championships: India go down 0-3 to Nigeria | Sakshi
Sakshi News home page

టీటీలో భారత్‌కు మూడో విజయం

Published Tue, Mar 1 2016 11:44 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

World TT Championships: India go down 0-3 to Nigeria

కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-7, 8-11, 11-3తో ఇలియా షిమిడ్‌పై, రెండో సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ 11-7, 11-7, 11-7తో లియోనెల్ వెబెర్‌పై, మూడో సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11-7, 11-5, 11-3తో నికొలస్ చంపాడ్‌పై నెగ్గారు. మరోవైపు భారత మహిళల జట్టుకు వరుసగా నాలుగో విజయం దక్కింది. గ్రూప్ ‘జి’లో భాగంగా భారత్‌తో తలపడాల్సిన నైజీరియా జట్టు ‘వాకోవర్’ ఇచ్చారు. దాంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. బుధవారం జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చెక్ రిపబ్లిక్‌తో భారత పురుషుల జట్టు; క్రొయేషియాతో భారత మహిళల జట్టు తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement