World Table Tennis Championships
-
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
ప్రపంచ టీటీలో శ్రీజ ముందంజ
World TT Championship: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రారంభమైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో శ్రీజ 4–1 (11–6, 11–9, 9–11, 11–4, 11–5) స్కోరుతో నికోల్ అర్లియా (ఇటలీ)ని ఓడించింది. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మనికా బాత్రా – అర్చనా కామత్ జోడి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి పోరులో మనిక – అర్చన ద్వయం 3–1 (10–12, 11–2, 11–9, 11–5) స్కోరుతో లిన్ యుషాన్ – క్వాన్ ఎమిలీ (అమెరికా)ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా మనికా బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్ జంట విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్లో మనిక – సత్యన్ 3–2 (9–11, 11–8, 14–16, 11–7, 11–6)తో గ్జియా లిన్ – ల్యూకా మ్లాడనోవిచ్ (లక్సెంబర్గ్)పై గెలుపొందింది. -
World TT Championship: ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 6–11, 8–11, 8–11తో అలెక్సిస్ చేతిలో... రెండో మ్యాచ్‌లో సత్యన్ 4–11, 2–11, 6–11తో ఫెలిక్స్ లెబ్రున్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 13–11, 11–13, 11–7, 8–11, 7–11తో జులెస్ రొలాండ్ చేతిలో ఓడిపోయారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక జర్మనీ, ఫ్రాన్స్, భారత్ ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం మొత్తం ఏడు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లకు మిగతా రెండు బెర్త్‌లు లభిస్తాయి. ముఖాముఖి ఫలితాల ఆధారంగా గ్రూప్– 2 నుంచి జర్మనీ, ఫ్రాన్స్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చైనాతో భారత పురుషుల జట్టు... చైనీస్ తైపీతో భారత మహిళల జట్టు తలపడతాయి. చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..! -
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలె, రీత్ టెనిసన్, స్వస్తిక ఘోష్‌లతో కూడిన భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్–5 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–1తో ఈజిప్ట్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–6, 11–4, 11–1తో హనా గోడాపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో మనిక 8–11, 11–6, 11–7, 2–11, 11–8తో దీనా మెష్రఫ్‌ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో దియా 11–5, 10–12, 11–9, 9–11, 4–11తో యుస్రా హెల్మీ చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 11–8, 11–8, 9–11, 11–6తో దీనా మెష్రఫ్‌పై గెలుపొందడంతో భారత విజయం ఖరారైంది. నాలుగు జట్లున్న గ్రూప్–5లో భారత్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, జర్మనీ ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచాయి. -
World team table tennis championships 2022: భారత టీటీ జట్లకు మిశ్రమ ఫలితాలు
చైనాలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మహిళల జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోగా... భారత పురుషుల జట్టు 3–0తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనిక 3–11, 1–11, 2–11తో 8వ ర్యాంకర్ హాన్ యింగ్ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 11–9, 12–10, 11–7తో 14వ ర్యాంకర్ నీనా మిటెల్‌హామ్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో దియా 11–9, 11–8, 6–11, 13–11తో 46వ ర్యాంకర్ సబీనె వింటర్‌ను ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 6–11, 7–11, 8–11తో మిటెల్‌హామ్ చేతిలో... ఐదో మ్యాచ్‌లో శ్రీజ 3–11, 5–11, 4–11తో హాన్ యింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
టీటీలో భారత్‌కు మూడో విజయం
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-7, 8-11, 11-3తో ఇలియా షిమిడ్పై, రెండో సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ 11-7, 11-7, 11-7తో లియోనెల్ వెబెర్పై, మూడో సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11-7, 11-5, 11-3తో నికొలస్ చంపాడ్పై నెగ్గారు. మరోవైపు భారత మహిళల జట్టుకు వరుసగా నాలుగో విజయం దక్కింది. గ్రూప్ ‘జి’లో భాగంగా భారత్‌తో తలపడాల్సిన నైజీరియా జట్టు ‘వాకోవర్’ ఇచ్చారు. దాంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. బుధవారం జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చెక్ రిపబ్లిక్‌తో భారత పురుషుల జట్టు; క్రొయేషియాతో భారత మహిళల జట్టు తలపడతాయి. -
భారత మహిళల ‘హ్యాట్రిక్’
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ రెండో డివిజన్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1తో ప్యుర్టోరికోపై, ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో 3-0తో పోర్చుగల్‌పై నెగ్గింది. ప్యుర్టోరికోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-5, 2-11, 7-11, 9-11తో దియాజ్ ఆడ్రియానా చేతిలో ఓడింది. అయితే రెండో సింగిల్స్‌లో షామిని 12-10, 11-9, 7-11, 11-5తో దియాజ్ మిలానిపై తర్వాతి మ్యాచ్‌లో మధురికా 11-4, 11-9, 11-7తో రియోస్ డానిలిపై; రివర్స్ సింగిల్స్‌లో షామిని 11-7, 13-11, 8-11, 11-8తో దియాజ్ ఆడ్రియానాపై నెగ్గారు. పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 7-11, 11-8, 9-11, 11-9తో ఒలివర్ లీలపై; మౌమా దాస్ 11-5, 11-9, 11-6తో మార్టిన్స్ కాటియాపై; షామిని 11-1, 11-4, 11-8తో మైకేల్ ప్యాట్రికాపై గెలిచారు. పురుషుల గ్రూప్ ‘ఎఫ్’ రెండో డివిజన్ రెండో రౌండ్లో టర్కీపై 3-0తో గెలిచిన భారత్... మూడో లీగ్ మ్యాచ్‌లో 0-3తో నైజీరియా చేతిలో ఓడింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11-5, 11-5, 11-7తో గుండుజు ఇబ్రహీంపై; రెండో సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-8, 11-6, 11-7తో మెంజి జెన్కేపై; మూడో సింగిల్స్‌లో ఆంధోని అమల్‌రాజ్ 11-13, 11-4, 11-6, 11-7తో అబ్దుల్లాపై విజయం సాధించారు. తర్వాత నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సౌమ్యజిత్ ఘోష్ 5-11, 4-11, 3-11తో అరుణ ఖాద్రీ చేతిలో; శరత్ కమల్ 13-15, 6-11, 13-11, 5-11తో ట్రయోలా సెగున్ చేతిలో; ఆంథోని అమల్‌రాజ్ 13-11, 8-11, 9-11, 8-11తో అబిడున్ బోడే చేతిలో పరాజయం చవిచూశారు. -
భారత జట్ల శుభారంభం
టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్-ఎఫ్ రెండో డివిజన్ తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3-0తో వియత్నాంపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో ఆడిన ఆచంట శరత్ కమల్ 11-8, 11-6, 5-11, 11-6తో టు నగుయెన్‌పై నెగ్గాడు. రెండో సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ 12-10, 11-5, 11-6తో టియాన్ డాట్ లీని ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్‌లో హర్మిత్ దేశాయ్ 11-5, 13-11, 12-10తో బా యువాన్ అన్ డొయాన్‌పై గెలవడంతో భారత్ 3-0తో నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత టర్కీతో, అనంతరం నైజీరియాతో భారత్ ఆడుతుంది. రెండో డివిజన్లో మొత్తం 24 జట్లు నాలుగు గ్రూప్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు.. మిగతా టీమ్‌లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ టాపర్లు రెండో దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘జి’లో భారత మహిళల జట్టు తొలి రౌండ్లో 3-0తో కొలంబియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-2, 12-10, 11-2తో పౌలా మెదీనాపై, రెండో సింగిల్స్‌లో మణికా బాత్రా 11-5, 11-5, 11-4తో లేడీ రువానోపై, మూడో సింగిల్స్‌లో 11-4, 11-8, 11-3తో లుసా జులుఆగాపై గెలిచారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత ప్యుర్టోరికో, ఆ తర్వాత పోర్చుగల్‌తో భారత్ ఆడుతుంది.