చైనాలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత మహిళల జట్టు 2–3తో జర్మనీ చేతిలో ఓడిపోగా... భారత పురుషుల జట్టు 3–0తో ఉజ్బెకిస్తాన్‌పై గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనిక 3–11, 1–11, 2–11తో 8వ ర్యాంకర్ హాన్ యింగ్ చేతిలో ఓడింది.
రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 11–9, 12–10, 11–7తో 14వ ర్యాంకర్ నీనా మిటెల్‌హామ్‌పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో దియా 11–9, 11–8, 6–11, 13–11తో 46వ ర్యాంకర్ సబీనె వింటర్‌ను ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 6–11, 7–11, 8–11తో మిటెల్‌హామ్ చేతిలో... ఐదో మ్యాచ్‌లో శ్రీజ 3–11, 5–11, 4–11తో హాన్ యింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment