World TT Championship: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రారంభమైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్‌లో శ్రీజ 4–1 (11–6, 11–9, 9–11, 11–4, 11–5) స్కోరుతో నికోల్ అర్లియా (ఇటలీ)ని ఓడించింది.
మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మనికా బాత్రా – అర్చనా కామత్ జోడి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి పోరులో మనిక – అర్చన ద్వయం 3–1 (10–12, 11–2, 11–9, 11–5) స్కోరుతో లిన్ యుషాన్ – క్వాన్ ఎమిలీ (అమెరికా)ను చిత్తు చేసింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా మనికా బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్ జంట విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్‌లో మనిక – సత్యన్ 3–2 (9–11, 11–8, 14–16, 11–7, 11–6)తో గ్జియా లిన్ – ల్యూకా మ్లాడనోవిచ్ (లక్సెంబర్గ్)పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment