సెమీస్‌లో సౌమ్యజిత్ | CW Table Tennis: Sathiyan-Ankita win mixed doubles gold | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సౌమ్యజిత్

Published Mon, Dec 21 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

CW Table Tennis: Sathiyan-Ankita win mixed doubles gold

సూరత్: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు సౌమ్యజిత్ ఘోష్, సానిల్ శెట్టి, ఆంథోనీ అమల్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరుకొని మూడు పతకాలను ఖాయం చేశారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్ 11-4, 11-8, 11-6, 12-10తో గావిన్ రుమ్‌గె (స్కాట్లాండ్)పై, సానిల్ శెట్టి 9-11, 4-11, 11-9, 7-11, 11-8, 11-9, 11-5తో హర్మీత్ దేశాయ్ (భారత్)పై, అమల్‌రాజ్ 11-4, 11-4, 11-4, 11-2తో అభిషేక్ (భారత్)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో చెన్ ఫెంగ్ (సింగపూర్) 13-11, 9-11, 11-7, 12-10, 4-11, 11-5తో సత్యన్ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మణిక బాత్రా, మౌమా దాస్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకొని రెండు పతకాలను ఖాయం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement