మెయిన్ ‘డ్రా’లో సోమ్‌దేవ్ | Somdev Devvarman gets Chennai Open main draw berth | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’లో సోమ్‌దేవ్

Published Thu, Dec 19 2013 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

సోమ్‌దేవ్

సోమ్‌దేవ్

చెన్నై: భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు చెన్నై ఓపెన్‌లో మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ఈనెల 30 నుంచి జనవరి 5 వరకు జరిగే ఈ టోర్నీలో సోమ్‌దేవ్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొనాల్సింది.
 
 అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న జర్గెన్ జాప్ (ఎస్తోనియా) గాయం కారణంగా వైదొలగడంతో అతని స్థానాన్ని సోమ్‌దేవ్‌తో భర్తీ చేశారు. భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఈసారీ పలువురు మేటి క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 15వ ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా), 16వ ర్యాంకర్ ఫాబియో ఫోగ్‌నిని (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ టిప్సరెవిచ్ (సెర్బియా) తమ ఎంట్రీని ఖరారు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement