
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా షూటింగ్ ప్రాంరంభమైంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తలైవార్‌కి ఇది 168 చిత్రం కావడం విశేషం. ఎంతిరన్, పేట వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా చిత్ర బృందం రజనీ 168 సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు టైటిల్ వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక రజనీ- మీనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ముత్తు’ సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
#Thalaivar168 is #Annaatthe#அண்ணாத்த@rajinikanth @directorsiva @KeerthyOfficial @immancomposer@prakashraaj @khushsundar @sooriofficial @actorsathish pic.twitter.com/GtaYEoKf6N
— Sun Pictures (@sunpictures) February 24, 2020
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకతంలో రజనీ నటించిన ‘దర్బార్’ సంక్రాంతి బరితో దిగి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. నివేదా థామస్, సునీల్ శెట్టి, మోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. దర్బార్ లైకా ప్రొడక‌్షన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దర్బార్‌లో రజనీ శక్తివంతమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment