![Ram Charan Boyapati Movie Title Vinaya Vedheya Rama - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/7/Vinaya%20Vidheya%20Rama.jpg.webp?itok=WdvVPeXD)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు స్టేట్‌రౌడీ, తమ్ముడు లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యం తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక టైటిల్ తరహాలోనే ఈ సినిమాకు కూడా క్లాస్ టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment