పవర్‌ఫుల్‌ రుద్ర | Vaishnav Tej Aadi Keshava First Glimpse | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ రుద్ర

Published Tue, May 16 2023 1:16 AM | Last Updated on Tue, May 16 2023 1:16 AM

Vaishnav Tej Aadi Keshava First Glimpse - Sakshi

అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని శివాలయాన్ని కొందరు గూండాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అడ్డుకోవడానికి రుద్ర రంగంలోకి దిగుతాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది? తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో హీరో వైష్ణవ్‌ తేజ్‌ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

ఈ గ్లింప్స్‌లో పవర్‌ఫుల్‌ రుద్రగా ఉగ్రరూపం చూపించారు వైష్ణవ్‌ తేజ్‌. చిత్ర పాత్రలో హీరోయిన్‌ శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా కీలక పాత్రలో అపర్ణా దాస్, విలన్‌గా జోజు జార్జ్‌ నటిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ  ఎస్‌. నాగ వంశీ, ఎస్‌. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్, కెమెరా: డడ్లీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement