సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా సొంతం చేసుకుంది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ స్వితోలినా 3–6, 6–2, 6–2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. ఈ క్రమంలో 2013లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గ్రూప్ దశలో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వొజ్నియాకి (డెన్మార్క్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)లపై నెగ్గిన స్వితోలినా... సెమీఫైనల్లో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. విజేతగా నిలిచిన స్వితోలినాకు 23 లక్షల 60 వేల డాలర్లు (రూ. 17 కోట్ల 25 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్‌కు 12 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment