Elina Svitolina
-
దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారులు తమ దేశంపై రష్యా జరుపుతున్న అమానుష దాడిని వ్యతిరేకిస్తూ పలు విధాలుగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందని ఫుట్‌బాలర్స్ తాము ఆడుతున్న మ్యాచ్‌ల్లో దేశానికి తమ వంతు మద్దతు తెలుపుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గత శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ క్రీడల్లో రష్యా, బెలారస్‌కు చెందిన జాతీయ జెండాలను ప్రదర్శన చేయొద్దని కోరింది. ఇక దీనికి అదనంగా జాతీయ గీతం, సింబల్స్, కలర్స్‌ను కూడా ఎక్కడా వాడకూడదంటూ ఐవోసీ అధికారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఐవోసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఎలినా విటోలినా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వైఖరిని ఎండగడుతూ.. మాంటేరీ ఓపెన్‌లో ఆ దేశానికి చెందిన టెన్నిస్ ప్లుయర్ అనస్థీషియా పోటాపోవాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఆడేది లేదంటూ పేర్కొంది.ఈ విషయాన్ని ట్విటర్లో సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ''డియర్ ఆల్.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ తరపున ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్ ఆర్గనైజేషన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐవోసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం రష్యా, బెలారస్‌కు చెందిన అథ్లెట్లను మాములుగా పరిగణించండి. ఆ దేశం తరపున ఎలాంటి జాతీయ జెండాలు, సింబల్స్, కలర్స్, జాతీయ గీతాలు ప్రదర్శన చేయకూడదు. ఇందులో భాగంగానే మాంటేరీ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణితో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. సదరు ఆర్గనైజేషన్స్ తమ వైఖరిని తెలిపే వరకు రష్యాతో ఎలాంటి మ్యాచ్ ఆడదలచుకోలేదు. అయితే రష్యన్ అథ్లెట్స్‌ను అవమానించడం ఎంతమాత్రం కాదు. మా దేశంపై దాడి చేయడంలో రష్యా ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులందరూ మద్దతుగా నిలవాల్సినవ అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లు ముందు నిలబడాల్సిన అవసరం ఉంది.'' అంటూ పేర్కొంది. చదవండి: Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ Rohit Sharma-Saba Karim: కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ ✊🏼🇺🇦 #Ukraine #Україна #StandWithUkriane pic.twitter.com/1LT4WjrYI9 — Elina Monfils (@ElinaSvitolina) February 28, 2022 -
ఉక్రెయిన్ సైన్యానికి నా ప్రైజ్‌మనీ: స్వితోలినా
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. -
French Open 2021: స్వితోలినా ఇంటిముఖం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా... వారి సరసన తాజాగా ఐదో సీడ్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–2తో స్వితోలినాను ఓడించి వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా నెట్‌వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు సాధించగా... స్వితోలినా సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/4), 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, నాలుగో సీడ్ సోఫియా (అమెరికా) 4–6, 6–4, 6–1తో పెగూలా (అమెరికా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 7–5తో 18వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17వ సీడ్ సాకరి (గ్రీస్) 7–5, 6–7 (2/7), 6–2తో 14వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. వరుసగా 12వ ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) వరుసగా 12వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో బెరాన్కిస్ (లిథువేనియా)పై గెలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో నాదల్ 6–3, 6–3, 6–3తో కామరూన్ నోరి (బ్రిటన్)పై, సిట్సిపాస్ 5–7, 6–3, 7–6 (7/3), 6–1తో ఇస్నెర్ (అమెరికా)పై, ష్వార్ట్‌జ్‌మన్ 6–4, 6–2, 6–1తో ఫిలిప్ కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. -
స్వితోలినా కూడా తప్పుకుంది
న్యూయార్క్: కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని... ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్న స్టార్ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు దూరం కాగా... తాజాగా మహిళల సింగిల్స్ జాబితాలో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో ర్యాంకర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) కూడా చేరారు. ‘సురక్షిత వాతావరణంలో యూఎస్ ఓపెన్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను నేను గౌరవిస్తున్నాను. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ప్రయాణించి నాతోపాటు నా సహాయక సిబ్బందిని ప్రమాదంలో నెట్టాలని భావించడంలేదు’ అని గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన స్వితోలినా వ్యాఖ్యానించింది. ‘కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముందుగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని మా దేశ ప్రధాని కోరారు. దాంతో నాకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్లే కోర్టు టోర్నీకి సన్నాహాలు దెబ్బతింటాయి’ అని 28 ఏళ్ల కికి బెర్టెన్స్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటిపోగా... లక్షా 60 వేల మంది మరణించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు న్యూయార్క్‌లో జరుగుతుంది. -
సూపర్ స్వితోలినా
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా సొంతం చేసుకుంది. సింగపూర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ స్వితోలినా 3–6, 6–2, 6–2తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. ఈ క్రమంలో 2013లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గ్రూప్ దశలో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా వొజ్నియాకి (డెన్మార్క్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)లపై నెగ్గిన స్వితోలినా... సెమీఫైనల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించింది. విజేతగా నిలిచిన స్వితోలినాకు 23 లక్షల 60 వేల డాలర్లు (రూ. 17 కోట్ల 25 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 12 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సెరెనాపై ప్రతీకారం తీర్చుకున్న ఇలినా
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్‌కు మూడో రౌండ్లో చుక్కెదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ , మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓటమి పాలవడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్లో 6-4, 6-3 తేడాతో ఉక్రెయిన్ భామ ఇలినా స్విటోలినా చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో ప్రపంచ 20వ ర్యాంక్ ప్లేయర్ ఇలినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గతంలో ఇలినాతో తలపడిన నాలుగుసార్లు సెరెనాదే పైచేయి కాగా, తాజా విజయంతో ఇలినా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. 'ఇలినా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. విజయానికి ఆమె అర్హురాలే. ఈ ఓటమి నన్ను చాలా నిరాశ పరిచింది' అని పేర్కొంది. -
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇవనోవిచ్ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ మూడో రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉక్రెయిన్ కు చెందిన 18వ సీడ్ క్రీడాకారిణి ఎలినా స్వితోలినా 6-4, 6-4 తేడాతో ఇవనోవిచ్ పై విజయం సాధించింది. వరుస రెండు సెట్లను కైవసం చేసుకున్న స్వితోలినా అంచనాలు మించి రాణించి నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది.