సెరెనాపై ప్రతీకారం తీర్చుకున్న ఇలినా | Serena Williams stunned by Elina Svitolina at Rio 2016 Olympics | Sakshi
Sakshi News home page

సెరెనాపై ప్రతీకారం తీర్చుకున్న ఇలినా

Published Wed, Aug 10 2016 3:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

సెరెనాపై ప్రతీకారం తీర్చుకున్న ఇలినా

సెరెనాపై ప్రతీకారం తీర్చుకున్న ఇలినా

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్కు మూడో రౌండ్లో చుక్కెదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ , మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ ఓటమి పాలవడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్లో 6-4, 6-3 తేడాతో ఉక్రెయిన్ భామ ఇలినా స్విటోలినా చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో ప్రపంచ 20వ ర్యాంక్ ప్లేయర్ ఇలినా క్వార్టర్స్కు దూసుకెళ్లింది.

గతంలో ఇలినాతో తలపడిన నాలుగుసార్లు సెరెనాదే పైచేయి కాగా, తాజా విజయంతో ఇలినా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. 'ఇలినా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. విజయానికి ఆమె అర్హురాలే. ఈ ఓటమి నన్ను చాలా నిరాశ పరిచింది' అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement