అమెరికా నల్లకలువ, 23 గ్రాండ్‌స్లామ్‌ల విన్నర్ అయిన సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన ఈ దిగ్గజ క్రీడాకారిణి.. తన రిటైర్మెంట్ నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. యూఎస్ ఓపెన్-2022లో తన చివరి మ్యాచ్ ఆడిన సెరెనా.. మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం అంటూ తాజాగా వెల్లడించింది.
తన వ్యాపార ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెరెనా మాట్లాడుతూ.. తాను రిటైర్ కాలేదని, ఆట నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, ఇప్పటికీ తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానని రీఎంట్రీపై హింట్ ఇచ్చింది. వచ్చే ఏడాది (2023) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేయవచ్చని పరోక్ష సంకేతాలు పంపింది.
కాగా, యూఎస్ ఓపెన్-2022 మూడో రౌండ్‌లో నిష్క్రమించిన తర్వాత నిర్వాహకులు సెరెనాకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. సెరెనా తాజా నిర్ణయంతో అభిమానులతో పాటు నిర్వాహకులు సైతం అవాక్కవుతున్నారు. 41 ఏళ్ల సెరెనా విలియమ్స్ చివరిగా 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది.
చదవండి: 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'
Comments
Please login to add a commentAdd a comment