అధర్వ హీరోగా కొత్త మూవీ.. టైటిల్ ఫిక్స్! | Kollywood Star Atharvaa Latest Movie Title Name DNA Shooting Started | Sakshi
Sakshi News home page

Atharvaa: అధర్వ హీరోగా వస్తోన్న 'డీఎన్‌ఏ'!

Published Thu, Oct 12 2023 7:05 AM | Last Updated on Thu, Oct 12 2023 7:06 AM

Kollywood Star Atharvaa Latest Movie Title Name DNA Shooting Started - Sakshi

కోలీవుడ్ నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి డీఎన్‌ఏ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు మనం కొత్తి పరవై, డాడా, కళువేత్తి మూర్కన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఒలింపియా మూవీస్‌ అధినేత అంబేత్‌కుమార్‌ తర్వాత చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా చిత్తా చిత్రంతో పాపులర్‌ అయిన మలయాళ నటి నిమీషా సజయన్‌ నటిస్తున్నారు. కాగా ఇంతకుముందు ఒరునాళ్‌ కూత్తు, మాన్‌స్టర్‌, పర్హానా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు)

తాజాగా ఈ మూవీకి డీఎన్‌ఏ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం బుధవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకలో నిర్మాత ఆర్‌బీ.చౌదరి, దర్శకుడు పా.రంజిత్‌ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని త్వరగా పూర్తిచేయనున్నట్లు చెప్పారు. కాగా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.

(ఇది చదవండి: నువ్వు నీలా ఉండు అని చెప్పింది )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement