సస్పెన్స్ థ్రిల్లర్‌గా హీట్‌.. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ | Heat Movie First Look Poster Release Today | Sakshi
Sakshi News home page

Heat Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా హీట్‌.. ఆసక్తి పెంచుతోన్న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ఫస్ట్ లుక్‌ పోస్టర్‌

Apr 26 2023 9:22 PM | Updated on Apr 26 2023 9:22 PM

Heat Movie First Look Poster Release Today - Sakshi

వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి జంటగా నటించిన చిత్రం 'హీట్'. ఈ చిత్రానికి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను  ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే..ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పోస్టర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల  సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement