Producer Bandla Ganesh Tweet Viral On NTR30 Movie Title Devara - Sakshi
Sakshi News home page

NTR30 - Bandla Ganesh: దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్‌

May 19 2023 6:49 PM | Updated on May 19 2023 7:52 PM

Producer Bandla Ganesh Tweet Viral On NTR30 Movie Title Devara - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్‌ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారనే టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్‌ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి: బాలీవుడ్‌ హీరో ఇం‍ట్లో తీవ్ర విషాదం..!)

అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను మూవీ యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది.  టైటిల్‌ ఆసక్తికరంగా ఉండడంతో తారక్‌ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్‌లు తయారు చేసి షేర్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ తాజాగా చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది.

 బండ్ల గణేశ్ ట్వీట్‌లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్‌. ఇది మన యంగ్‌ టైగర్‌ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్‌ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' పరిస్థితి ఏంటీ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement