
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27 థియేటర్ల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అయితే దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్, అభిమానులపై ప్రశంసలు కురిపించారు. దేవరలో హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ నటనను కొనియాడారు. తమ పాత్రలకు ప్రాణం పోసి, కథకు జీవం ఇచ్చారన్నారు.
అలాగే దేవర డైరెక్టర్ కొరటాల శివతో పాటు మూవీకి పనిచేసిన సాంకేతిక సిబ్బందికి సైతం ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతమందిచాడన్నారు. దేవర సినిమాను తమ భుజాలపై మోసి ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు.
Grateful. pic.twitter.com/YDfLplET7S
— Jr NTR (@tarak9999) October 15, 2024
Comments
Please login to add a commentAdd a comment