మహేష్‌ టైటిల్‌పై రచ్చ.. వైరల్‌! | Is Mahesh Babu New Movie Title RISHI | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 3:41 PM | Last Updated on Sun, Apr 7 2019 12:28 PM

Is Mahesh Babu New Movie Title RISHI - Sakshi

మహేష్‌ బాబు ‘భరత్‌ అనే నేను’ లాంటి భారీ హిట్‌ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే మహేష్‌ బాబుపై కాలేజ్‌ సీన్స్‌ను తెరకెక్కించారు. అయితే ఆగస్టు 9న ఈ సూపర్‌ స్టార్‌ పుట్టిన రోజు. అసలే మహేష్‌కు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఇక ఈ టాలీవుడ్‌ ప్రిన్స్‌ పుట్టిన రోజున అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఆ వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. 

అయితే ఈ చిత్రబృందం.. గత రెండు రోజులుగా కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకున్ని ఫ్యాన్స్‌... సినిమా టైటిల్‌ను ఊహించేసుకున్నారు. ఇప్పుడు వారు ఊహించిన పేరు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘రిషి’ అని టైటిల్‌ ఉంటుందని కొందరు.. మహేష్‌ చేయబోయే పాత్ర పేరు రిషి కావొచ్చని మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఏదేమైనా.. ఆగస్టు 9న వీటన్నింటికి ఓ సమాధానం దొరకనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement