ఫ్యాన్స్‌కు మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్‌ | Maharshi Is Mahesh Babu 25Th Movie Title | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 8:32 AM | Last Updated on Sun, Apr 7 2019 4:46 PM

Maharshi Is Mahesh Babu 25Th Movie Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేడు (ఆగస్టు 9) టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్‌ మూవీ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో మహేష్‌ అభిమానులు ఫుల్‌ హ్యాపీ. ‘భరత్‌ అనే నేను’  అనంతరం వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ‘ప్రిన్స్‌’  మహేష్‌ హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందరు అనుకున్నట్లుగా సూపర్‌స్టార్‌ 25వ మూవీ పేరు రిషి కాదని మహర్షి అని తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మహేష్ షేర్‌ చేసుకున్నారు. ఓ చేతిలో ల్యాప్‌టాప్‌తో ఉన్న మహేష్‌.. మరో చేత్తో షర్ట్‌ కాలర్‌ను పట్టుకున్న ఈ ఫస్ట్‌లుక్‌ ఫొటోను బుధవారం అర్ధరాత్రి దాటాక సోషల్‌ మీడియాలో మహేష్‌ పోస్ట్‌ చేశారు.

ఈ మధ్యే మహేష్‌ బాబుపై కొన్ని కాలేజీ సీన్లను తెరకెక్కించారు. అయితే ఇటీవల ఈ చిత్రబృందం.. కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్‌... సినిమా టైటిల్‌ను ‘రిషి’  అని, లేకపోతే మహేష్‌ క్యారెక్టర్‌ పేరు రిషి అని ఊహించేసుకున్నారు. అయితే అందరు అనుకున్నట్లుగానే మహేష్‌ బర్త్‌డే రోజు (ఆగస్టు 9న) వీటన్నింటికి ఓ సమాధానం దొరికింది. తన లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ మహర్షి అని మహేష్‌ చేసిన ట్వీట్‌తో స్పష్టమైంది. మరోవైపు టాలీవుడ్‌ రాజకుమారుడికి పుట్టినరోజు విషెస్‌తో సోషల్‌ మీడియాలో భారీ పోస్టులు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మహేష్‌ కెరీర్‌లో 25వ మూవీ ‘మహర్షి’కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌. 2019లో ఈ మూవీ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement