![Kollywood Star Hero Suriya Next Film Titled To Be Veer - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/9/SURIYA.jpg.webp?itok=RbDpPkCs)
తమిళసినిమా: కోలీవుడ్‌లో వైవిధ్యం కోసం పరితపించే నటుల్లో సూర్య ఒకరని చెప్పవచ్చు. ఈయన ఇటీవల నటించిన సరరైపోట్రు, జైభీమ్ వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సూర్య తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రీడీ ఫార్మెట్లో రూపొందుతున్న ఇందులో సూర్య 13 పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చరిత్ర కథతో మొదలై నేటి కాలం వరకు సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం.
చిత్రాన్ని 10 భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆ మధ్య విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే చిన్న వర్గాల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇప్పటి వరకు సూర్య 42 చిత్రంగా ప్రచారంలో ఉన్న దీనికి వీర్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సావజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. దర్శకుడు శివకు సెంటిమెంట్ ఉందంటారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రాలకు వీరం, వివేకం, వలిమై అంటూ వ అక్షరంతో మొదలయ్యే పేర్లతోనే ప్రారంభం కావడం విశేషం.
ఈ చిత్రాలు అన్ని మం విజయాన్ని సాధించాయి. అయితే ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా రపొందింన చిత్రానికి అన్నాత్తే అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో దర్శకుడు శివ మళ్లీ సర్య చిత్రంలో తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సర్య నటిస్తున్న 42 చిత్ర టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సర్య దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment