
భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇవ్వబోతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే.. 'పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే గొడవలు, రకరకాల మనుషుల గురించే ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్‌లో ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఒక ఊరిలో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా సతీశ్, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment