తమిళసినిమా: నటుడు విమల్‌కు ఎక్కడో మచ్చ ఉంది. ఏమిటీ అర్థం కావడం లేదా. విమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు (ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆయనకు జంటగా ఆషా జవేరి నటిస్తోంది. ఏఆర్.ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి ప్రొడక్షన్స్ పతాకంపై నటి చార్మిళ మాన్రే, ఆర్.సావంత్ కలిసి నిర్మిస్తున్నారు. వీరిలో నటి చార్మిళ మాన్రే కన్నడంలో ప్రముఖ కథానాయకిగా రాణించారన్నది గమనార్హం. ఈమె అక్కడ ప్రముఖ హీరోలందరితోనూ సుమారు 40 చిత్రాలకు పైగా నటించారు. ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు.
చార్మిళ మాన్రేను కన్నడంలో కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్.ముఖేశ్‌నే ఆమె తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈయన తమిళంలో ఇండ్రు ముదల్, ఆయుదం చిత్రాలతో పాటు కన్నడంలో గజనీ, జోకర్ అనే హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. తాజా చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం గురించి తెలుపుతూ ఇది గ్లామర్‌తో కూడిన హ్యూమర్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. దీని షూటింగ్ తొలి షెడ్యూల్ 10 రోజుల పాటు లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ షెడ్యూల్‌ను చెన్నైలో జరుపుతున్నట్లు చెప్పారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు జాలీగా ఎంజాయ్ చేసే పూర్తి ఎంటర్‌టెయినర్‌గా ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఉంటుందని, అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు అని దర్శకుడు తెలిపారు. దీనికి సంగీతాన్ని నటరాజ్ శం కరన్, ఛాయాగ్రహణం గోపి అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment