
విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ అనే టైటిల్ ఖరారైంది. విజయ్ కెరీర్‌లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ (2024) సందర్భంగా ఈసినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్ నేడు రానుందని కోలీవుడ్ సమాచారం. ఫస్ట్‌లుక్‌ని చూస్తే ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని స్పష్టమవుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, లైలా, స్నేహ, జయరాం, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment