
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి.
విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్‌యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించారు.
తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment