![Katha Venuka Katha Movie Title Launch BY Ali - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/3/aali.jpg.webp?itok=rllQ6Rnf)
కృష్ణచైతన్య, అలీ, విశ్వంత్, అవనింద్ర కుమార్, సునీల్
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్‌గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు.
‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్‌లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య.
Comments
Please login to add a commentAdd a comment