Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh First Look: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్,హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి నుంచే అప్‌డేట్ ఇస్తామంటూ ఊరించిన చిత్ర బృందం ఫైనల్‌గా ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అంటూ క్యాప్షన్‌ను జోడించారు.
పోస్ట్‌ర్ లుక్‌లో పవన్ బైక్‌పై కూర్చొని ఓ చేతిలో మైక్, మరో చేతిలో టీ గ్లాస్‌తో కనిపించారు. పవన్-హరీశ్ శంకర్ మూవీ కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
We all need your …
— Harish Shankar .S (@harish2you) September 9, 2021
Blessings & Best wishes…. 🙏🙏@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro
Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9
చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ
హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్
Comments
Please login to add a commentAdd a comment