తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌.. టైటిల్ ఫిక్స్‌ | Mohan Babu Manchu Lakshmi Agni Nakshatram Title Launch | Sakshi
Sakshi News home page

Mohan Babu Manchu Lakshmi: తండ్రీకూతుళ్లు తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం.. టైటిల్‌ ఇదే..

Published Sat, Jul 2 2022 7:47 AM | Last Updated on Sat, Jul 2 2022 7:56 AM

Mohan Babu Manchu Lakshmi Agni Nakshatram Title Launch - Sakshi

డాడ్‌ అండ్ డాటర్‌ మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ, విశ్వంత్‌ ప్రధాన తారాగణంగా ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో ​‍ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ లాంచ్ కార్యక్రమం జరిగింది. 

Mohan Babu Manchu Lakshmi Agni Nakshatram Title Launch: డాడ్‌ అండ్ డాటర్‌ మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ, విశ్వంత్‌ ప్రధాన తారాగణంగా ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్‌ ఖరారు చేశారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ లాంచ్ కార్యక్రమం జరిగింది. 

శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. 'పోలీస్‌ స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఇది. విశ్వంత్‌ కథానాయకుడిగా, సిద్ధిఖ్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు డైమండ్‌ రత్నబాబు కథ అందించారు' అని చిత్రయూనిట్‌ పేర్కొంది. మలయాళ నటుడు సిద్ధిఖ్‌, తమిళ నటుడు సముద్ర ఖని, చైత్రా శుక్లా, జబర్దస్త్‌ మహేశ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి లిజో కె. జెస్‌ సంగీతం అందించగా, గోకుల్‌ భారతి కెమెరా వర్క్ చేపట్టారు. ఈ సినిమాతో తొలిసారిగా తండ్రీ కూతుళ్లు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నటిస్తుండటం విశేషం. 

చదవండి: నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement