Manchu Lakshmi Shares Mohan Babu Tirupati Home Tour Video - Sakshi
Sakshi News home page

Lakshmi Manchu : తిరుపతిలో మోహన్‌ బాబు ఇల్లు చూశారా? ఎంత బావుందో..

Apr 30 2022 9:18 PM | Updated on May 1 2022 11:37 AM

Lakshmi Manchu Shares Mohan Babu Tirupathi Home Tour - Sakshi

Mohan Babu Tirupathi Home Tour: మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలె యూట్యూబర్‌గానూ అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్‌ వీడియాలతో ఆకట్టుకుంటుంది. తన ఛానెల్‌ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్‌, ఫోటో షూట్‌ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్‌ బాబు ఇంటిని నెటిజన్లను చూపించింది.

ఇప్పటికే గతంలో ఓ ఇంటిని చూపించిన లక్ష్మీ ఇప్పుడు తిరుపతిలో ఉన్న మోహన్‌బాబు ఇంటిని చూపించింది. ఎంతో విశాలమైన ఆ ఇంటి ప్రత్యేక విశేషాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తండ్రి గదిలో రోజ్‌వుడ్‌తో చేసిన వస్తువులను చూపించిన లక్ష్మీ మరెన్నో విషయాలను పంచుకుంది. అవేంటో తెలియాలంటే మోహన్‌ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement